Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ పరామర్శ.. సింగపూర్‌కు జయలలిత.. దత్తపుత్రుడికి చేదు అనుభవం..

తమిళనాడు సీఎం జయలలితను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. శుక్రవారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను శుక్రవారం ఉదయం పరామర్శించారు. అపోలో ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (13:13 IST)
తమిళనాడు సీఎం జయలలితను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. శుక్రవారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను శుక్రవారం ఉదయం పరామర్శించారు. అపోలో ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి రాహుల్ గాంధీని ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వైద్యులను జయ ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నారు. 
 
యువనేతను ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. డాక్టర్లను అడిగి జయ ఆరోగ్యం ఆరా తీశాడు. పావుగంట పాటు ఆస్పత్రిలో ఉన్నారు. జయలలిత వద్దకు ఎవరినీ వెళ్లనివ్వకపోతుండటంతో రాహుల్ ఆమెను చూశారా, లేదా డాక్టర్లతో మాట్లాడి వచ్చేశారా అన్న విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. 
 
ఊపిరిత్తులు, మధుమేహం, ఆస్తమా ఇన్‌ఫెక్షన్లకు సంబంధించి జయలలితకు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అపోలో వైద్యులతోపాటు ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి వచ్చిన ప్రత్యేక టీం, లండన్ డాక్టర్ రిచర్డ్ బాలేలు జయలలితకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే అమ్మకు మెరుగైన చికిత్స కోసం సింగపూర్ ఆమెను పంపనున్నట్లు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గతంలో చికిత్స పొందిన ఆస్పత్రికే జయలలిత తీసుకెళ్ళేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. 
 
ఇదిలా ఉంటే.. తమిళనాడు సీఎం జయలలిత దత్తపుత్రుడికి చేదు అనుభవం ఎదురైంది. గత సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో చేరిన జయలలితను చూసేందుకు ఆమె దత్త పుత్రుడు, శశికళ సోదరి పుత్రుడైన వి.ఎన్. సుధాకర్ గురువారం సాయంత్రం ఆస్పత్రి వద్దకు వచ్చారు. 
 
అయితే ఆయనకు జయమ్మను పరామర్శించేందుకు అనుమతి నిరాకరించడం జరిగింది. దీంతో కారులో కూర్చునే అపోలో యాజమాన్యానికి ఎన్ని ఫోన్లు చేసినా సుధాకరన్‌కు అనుమతి లభించలేదు. గతంలో ఓ కేసులో సుధాకర్ ఇరుక్కున్న సందర్భంగా జయమ్మ ఆయనతో సంబంధాలను తెగతెంపులు చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ కారణంతోనే సుధాకర్‌ను వైద్యులు జయమ్మను కలిసేందుకు అనుమతించలేదని తెలిసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments