అమ్మకు బుజ్జి కుక్కపిల్లను గిఫ్టుగా ఇచ్చిన రాహుల్...

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2023 (12:09 IST)
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, తన తల్లి సోనియా గాంధీకి ఆమె తనయుడు రాహుల్ గాంధీకి బుజ్జి కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చారు. ఇది ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. గత ఆగస్టు నెలలో రాహుల్ గాంధీ  గోవాలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన ఆడ కుక్కపిల్లను ఆయన కొనుగోలు చేసి తనతో పాటు తీసుకొచ్చారు. 
 
దీన్ని ఓ అట్టపెట్టెలో పెట్టి సోనియా ముందుంచి తెరవమని కోరారు. పెట్టెను తెరచిన వెంటనే ఆమె ముఖంలో ఎనలేని సంతోషం కనిపించింది. కుక్కపిల్లను అమాంతం ఎత్తుకొని, కుమారుడు రాహుల్‌ను ప్రేమగా హత్తుకున్నారు. ఈ కుక్కపిల్లకు 'నూరీ' అని పేరు పెట్టారు. 
 
గోవాలో సేకరణ మొదలు నూరీని సోనియాకు అందించేవరకు జరిగిన పరిణామాలతో ఓ వీడియో రూపొందించారు. "ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం" (అక్టోబరు 4) సందర్భంగా ఆ వీడియోను రాహుల్‌ బుధవారం తన యూట్యూబ్‌ ఛానల్‌లో షేర్‌ చేయగా.. అది వైరల్‌గా మారింది. 
 
'మా కుటుంబంలోకి కొత్త సభ్యురాలు వచ్చింది' అని రాహుల్‌ అన్నారు. సోనియా వద్ద ఇప్పటికే 'లాపో' అనే శునకం ఉండగా.. ఇపుడు నూరీ కూడా చేరింది. దీంతో రాహుల్ కుటుంబ సభ్యుల సంఖ్య నాలుగుకు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments