Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీని హత్య చేయించిందీ ఆర్ఎస్ఎస్‌నే.. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోను : రాహుల్ గాంధీ

జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేయించిందీ ఆర్ఎస్ఎస్ అంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెగేసి చెప్పారు. ఈ కేసు విచారణలో భాగంగా, ఆయన బుధవ

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (13:45 IST)
జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేయించిందీ ఆర్ఎస్ఎస్ అంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెగేసి చెప్పారు. ఈ కేసు విచారణలో భాగంగా, ఆయన బుధవారం మహారాష్ట్రలోని భివాండీ న్యాయస్థానం ఎదుట విచారణకు హాజరయ్యారు.
 
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మహాత్మ గాంధీని హత్య చేయించింది ఆర్ఎస్ఎస్ అని వ్యాఖ్యానించడంపై ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నిమిత్తం ఆయన భివాండీ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని కోర్టుకు రాహుల్ తెలిపారు. దీంతో కేసు విచారణ వచ్చే నెల 28కి వాయిదా వేసిన న్యాయస్థానం, వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. 
 
అనంతరం ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. దేశ ప్రయోజనాల కోసం పెద్ద నోట్లను రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, దానికి అందరం సంతోషిద్దామని, అయితే కేంద్రం చెబుతున్న నల్లధనం ఎవరి వద్ద ఉందని ఆయన ప్రశ్నించారు. కేంద్రం చెబుతున్నట్టు నల్లధనం ఉన్నవారెవరైనా ఈ ఎనిమిది రోజుల్లో బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కట్టారా? అని ఆయన ప్రశ్నించారు. తనకు ఎవరూ కనిపించలేదని ఆయన చెప్పారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది.
 
అధికారం కట్టబెట్టిన ప్రజలను ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ఆయన అడిగారు. దేశ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోమని రాహుల్ హెచ్చరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments