Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహ వైద్యుల వేధింపులు... రేడియాలజీ డాక్టర్ సూసైడ్

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (13:42 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ రేడియాలజీ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. భర్త, పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడింది. తాను చనిపోతూ ఓ సూసైడ్ లేఖను రాసిపెట్టింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) ఆసుపత్రిలో పూనమ్ వోహ్రా (52) రేడియాలజీ డాక్టర్‌గా పనిచేస్తోంది. తనకు ప్రభుత్వం కేటాయించిన వసతి గృహంలో భర్త చిరంజీవి వోహ్రా, పిల్లలతో పాటు ఉంటున్నారు. 
 
ఆమె 2016లో ఆర్ఎంఎల్‌లో కన్సల్టెంట్ రేడియాలజిస్ట్‌గా నియమితులయ్యారు. కొద్ది కాలంలోనే మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. మధ్యాహ్నం భర్త పిల్లలు బయటకు వెళ్లిన సమయం చూసి ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకుని చనిపోయింది. కొద్దిసేపటి తర్వాత పొరుగువారు తలుపు తట్టగా ఎంతకు తీయకపోవడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని గమనించారు. అక్కడ లభ్యమైన సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డిఎస్పీ మధుర్‌వర్మ తెలిపిన వివరాల ప్రకారం పూనమ్ వోహ్రా సూసైడ్ నోట్‌లో తాను పనిచేస్తున్న ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులు తనను వేధిస్తున్నారని రాసివుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వేధిస్తున్నారని ఆరోపించిన ముగ్గురు వైద్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments