ఆన్‌లైన్‌లో పిల్లి పిల్లను ఆర్డర్ చేస్తే.. అది పిల్లి కాదని..?

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (16:05 IST)
ఇంట్లో పిల్లి, శునకాలను పెంచుకోవడం సాధారణమే. కానీ ఒక జంటకు మాత్రం ఈ విషయంలో చేదు అనుభవం ఎదురైంది. వారు పిల్లి పిల్లను ఆన్‌లైన్‌లో కొన్నారు. కానీ అది పులి అని తెలిసి భయపడ్డారు. అంతేకాదు, వారికి తెలియకుండా చేసిన తప్పు చేసి జైలు పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్‌లోని నార్మండీ ప్రాంతం లి హవ్రెకు చెందిన ఓ జంట 2018లో ఆన్‌లైన్‌లో ఓ యాడ్ చూశారు. 
 
సవానా జాతికి చెందిన పిల్లి పిల్లను అమ్ముతామంటూ యాడ్‌లో ఉంది. దీంతో వారు యాడ్‌ను చూసి 7వేల డాలర్లు (దాదాపుగా రూ.5.1 లక్షలు) వెచ్చించి ఆన్‌లైన్‌లో పిల్లి పిల్లను ఆర్డర్ చేశారు. అయితే అది పిల్లి కాదు. పులి అని తేలింది.
 
రెండేళ్ల పాటు వారు దాన్ని పెంచుకున్నారు. కానీ దానికి పిల్లి లక్షణాలు కనిపించలేదు. దీంతో వారికి అనుమానం వచ్చి పోలీసులను పిలిచారు. వారు నిపుణులకు అప్పగించి పరీక్షించగా, అది పిల్లి కాదని, సుమత్రా దీవుల్లో ఉండే అరుదైన జాతికి చెందిన పులి అని తేలింది. ఆ విషయం ఆ దంపతులకు తెలియదు. అయినప్పటికీ వారిని నేరం చేసినట్లు భావించి పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments