Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథస్వామి ఆలయంలో భక్తులకు అనుమతి.. ఆధార్ తప్పనిసరి

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (19:09 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథస్వామి ఆలయంలోకి ఈ నెల 23 నుంచి భక్తులను అనుమతించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత మూడు నెలలుగా మూసివున్న ఆలయాన్ని ఇవాళ తిరిగి తెరిచారు. అయితే, ఇవాళ్టి నుంచి ఆగస్టు 16 వరకు ఆలయ సేవకుల కుటుంబసభ్యులకు మాత్రమే జగన్నాథుని దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
 
కొవిడ్ విస్తృతి నేపథ్యంలో గత ఏప్రిల్ 24 నుంచి ఆలయాన్ని మూసేశారు. ఇవాళ తిరిగి తెరిచారు. తొలి దశలో ఆలయ సేవకుల కుటుంబసభ్యులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నామని, వారంతా దేవాలయ కమిటీ జారీచేసిన గుర్తింపు కార్డుతోపాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును కూడా ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక రెండో దశలో ఆగస్టు 16 నుంచి పూరీ నివాసితులన అనుమతిస్తామని చెప్పారు.
 
ఇక మూడో దశలో ఆగస్టు 23 నుంచి అందరూ జగన్నాథుడి దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. అయితే వారు ఆలయానికి వచ్చే ముందు కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను కానీ, కొవిడ్-19 నెగెటివ్ ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్టునుకానీ చూపించాల్సి ఉంటుందన్నారు. ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్టు వ్యవధి దర్శనానికి ముందు 96 గంటలు మించకుండా ఉండాలని చెప్పారు. వీటితోపాటు ఆధార్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తీసుకుని రావాలని సూచించారు.
 
అయితే పూరీ పట్టణంలో శని ఆదివారాల్లో వీకెండ్ కర్ఫ్యూ కొనసాగుతుంది. కాబట్టి ఆ రెండు రోజులు ఆలయ ప్రవేశానికి కూడా ఆంక్షలు అమలవుతాయని, అందుకే ప్రతి శని ఆదివారాలు జగన్నాథుడి ఆలయాన్ని మూసివేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 555 Cr+ వసూళ్లు

భారతీయుడు2 లో క్యాలెండర్ సాంగ్ చేస్తున్న మోడల్ డెమి-లీ టెబో

కల్కి మొదటి వారాంతం హిందీ, ఉత్తర అమెరికా కలెక్టన్ల వివరాలు

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments