Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎస్ అధికారి అందానికి కాలేజీ విద్యార్థిని 'ఫిదా'.. పెళ్లి చేసుకుంటానని నానాయాగీ

సాధారణంగా సినీ హీరోల హీరోయిన్ల అందానికి యువతీయువకులు ఫిదా అయిపోతుండటం చూస్తుంటాం. మరికొంతమంది అమ్మాయిలైతే క్రికెటర్ల వెంటపడుతుంటారు. కానీ, ఈ కాలేజీ విద్యార్థిని మాత్రం 34 యేళ్ళ ఐపీఎస్ అధికారి వెంటపడుత

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (11:39 IST)
సాధారణంగా సినీ హీరోల హీరోయిన్ల అందానికి యువతీయువకులు ఫిదా అయిపోతుండటం చూస్తుంటాం. మరికొంతమంది అమ్మాయిలైతే క్రికెటర్ల వెంటపడుతుంటారు. కానీ, ఈ కాలేజీ విద్యార్థిని మాత్రం 34 యేళ్ళ ఐపీఎస్ అధికారి వెంటపడుతోంది. పైగా, అతన్నే పెళ్లి చేసుకుంటాననీ నానాయాగీ చేస్తోంది. దీంతో ఆ విద్యార్థినికి పలుమార్లు కౌన్సెలింగ్ ఇవ్వలేక పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
సచిన్ అతుల్కర్ అనే 34 యేళ్ల ఐపీఎస్ అధికారి ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఎంపీగా పని చేస్తున్నారు. చాలా అందగాడు కూడా. అయితే, పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్‌పూర్‌కు చెందిన 27 యేళ్ళ యువతి ఆయన అందానికి ఫిదా అయిపోయింది. దీంతో ఆయన్ను కలిసి తన మనసులోని మాటను వెల్లడిస్తానంటూ మంకుపట్టుపట్టింది. 
 
సోషల్ మీడియాలో సచిన్ అతుల్కర్ ఫొటోలను చూసి మనసు పారేసుకున్న సదరు యువతి, ఆయన్ను కలిసి, తన ప్రేమను వ్యక్తపరిచే ఉద్దేశ్యంతో వచ్చినట్టు గుర్తించిన పోలీసులు, ప్రస్తుతం ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఆమెను తిరిగి ఇంటికి పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ ఆమె వినడం లేదని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ రేఖా వర్మ తెలిపారు. 
 
ఎస్పీని కలిసి తన మనసులోని మాటను వెల్లడించాలన్న చెబుతోందని తెలిపారు. పైగా, ఆమె తల్లిదండ్రులను ఉజ్జయినికి పిలిపించినా, వారితో కలసి వెనక్కు వెళ్లేందుకు సిద్ధంగా లేదని, ఒకవేళ బలవంతంగా పంపిస్తే మాత్రం ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోంది. దీంతో ఏం చేయాలో పోలీసులకు పాలుపోవడం లేదు. ఈ విద్యార్థిని సైకాలజీలో పీజీ చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments