Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో వెళ్తున్నా వదలరా.. బయటికి లాగి మరీ యువతిపై సామూహిక అత్యాచారం..

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (09:04 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిర్భయ లాంటి ఘటనలు జరిగిన కఠినమైన శిక్షలు లేని కారణంగా కామాంధులు రెచ్చిపోతున్నారు. వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఎక్కడిపడితే అక్కడ అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా కారులో తన స్నేహితులతో కలిసి వెళ్తున్న యువతిని కారు నుంచి బయటికి లాగి మరీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. 
 
కారులో వెళుతున్న యువతిని బయటకు లాగి పదిమంది యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన పంజాబ్‌లోని లుధియానాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 21 ఏళ్ల యువతి తన స్నేహితుడితో కలిసి శనివారం రాత్రి లుధియానా నుంచి కారులో ఐజేవాల్ గ్రామానికి బయలుదేరింది.
 
వారిని గమనించిన పదిమంది యువకులు మూడు ద్విచక్ర వాహనాలపై వెంబడించారు. పెద్దగా అరుస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేశారు. కారు జాగ్రోన్ వద్దకు చేరుకోగానే కారుకు అడ్డంపడ్డారు. కారు ఆగగానే రాళ్లు, ఇటుకలతో కారుపై దాడి చేసి.. కారులోని యువతిని బయటికి లాగి.. కాలువ వద్దకు తీసుకెళ్లి... పది మంది యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో వున్న నిందితులను పట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్టు నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments