Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికతో ప్రేమికుడి సహజీవనం - ఓకే చెప్పిన హైకోర్టు

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (09:36 IST)
పంజాబ్ - హర్యానా హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. మైనారిటీ కూడా తీరని ఓ మైనర్ బాలికతో ప్రేమికుడు సహజీవనం చేసేందుకు కోర్టు సమ్మతించింది. సహజీవనం చేయాలని జంట నిర్ణయించుకున్నందున తీర్పులు ఇవ్వకూడదని తేల్చి చెప్పింది. 
 
పంజాబ్‌లోని బఠిండాలో నివసించే ఒక జంట వేసిన వేసిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు... వివాహం చేసుకోకుండానే పిటీషనర్లు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు, వారి నిర్ణయంలో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని జస్టిస్ సత్ ప్రకాశ్ వ్యాఖ్యానించారు. 
 
మైనారిటీ కూడా తీరని ఒక యువతి (17), 20 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. బాలికకు మరో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సమాయత్తం కాగా, ఈ జంట కోర్టును ఆశ్రయించింది. తల్లిదండ్రుల ప్రయత్నాలు తెలిసి ఇళ్లు విడిచి ప్రేమికుడి వద్దకు చేరుకున్నానని, రక్షణ కల్పించాలని వేడుకుంది. 
 
బాలిక మైనరిటీ తీరకపోవడంతో 18 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అప్పటివరకు సహజీవనం చేస్తామని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో జంటకు రక్షణ కల్పించడం మా బాధ్యత అని హైకోర్టు జడ్జి జస్టిస్ సంత్ ప్రకాశ్ వ్యాఖ్యానించి, ఆ జంటకు భద్రత కల్పించాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments