Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్‌ వైర్‌‌తో మెడకు ఉరి బిగించి మహిళా టెక్కీ హత్య

మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. ఓ మహిళా టెక్కీని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశారు. కంప్యూటర్‌ వైర్‌‌తో మెడకు ఉరి బిగించి హత్య చేసినట్టుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటన ఆదివారం స

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (09:46 IST)
మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. ఓ మహిళా టెక్కీని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశారు. కంప్యూటర్‌ వైర్‌‌తో మెడకు ఉరి బిగించి హత్య చేసినట్టుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
పుణే రాజీవ్ మహాత్మా గాంధీ ఇన్ఫోటెక్ పార్క్‌ కార్యాలయంలో కేరళకు చెందిన ఆనంద్ కె రాసిలా రాజు (25) అనే మహిళ పని చేస్తూ వస్తోంది. ఇన్ఫోసిస్ భవనం తొమ్మిదో అంతస్తులో విధి నిర్వహణలో ఉన్న ఆమెను ఎవరో గొం‍తు నులిమి హత్య చేశారు. బెంగళూరులోని ఆమె టీమ్‌‌తో ఆన్‌‌లైన్‍లో వర్క్‌ చేసుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
ఈ కేసులో సెక్యూరిటీ గార్డును ప్రధాన అనుమానితుడిగా పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అందించిన సమాచారం.. రాజు ఆదివారం కార్యాలయంలో పనిచేసుకుంటోంది. ఆమె మేనేజర్‌ ఆమెకు కాల్‌ చేసినప్పుడు.. సమాధానం రాకపోవడంతో సెక్యూరిటీ గార్డ్‌‌ను అలర్ట్‌ చేశాడు.
 
అయితే సెక్యూరిటీ గార్డు తనిఖీ చేయగా అపస్మారక స్థితిలో పడి ఉన్నట్టు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో ఆ హత్య జరిగి ఉండొచ్చని అసిస్టెంట్‌ కమిషనర్‌ వైశాలి జాదవ్‌ అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేట్‌​ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments