Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుణెలో జికా వైరస్ తొలి కేసు నమోదు: రీసెర్చ్‌లో సైంటిస్టుల బృందం

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (15:19 IST)
కేరళలో జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని బెల్సర్ గ్రామంలో ఓ మహిళలో జికా వైరస్ బారిన పడినట్లు అధికారులు గుర్తించారు. మహిళకు జికా వైరస్ సోకినట్లు తేలగానే ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఫాగింగ్‌, క్లీనింగ్ లాంటి నియంత్రణ చర్యలు చేపట్టామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదని తెలిపారు.
 
కొల్హాపూర్‌, సాహ్ని, సతారా, పుణె జిల్లాల్లో కరోనా వైరస్ విస్తృతి ఎక్కువగా ఉన్నదని మంత్రి తెలిపారు. రాష్ట్ర సగటుతో పోల్చుకుంటే ఈ నాలుగు జిల్లాల్లో పాజిటివిటీ రేటు చాలా ఎక్కువగా ఉందనీ.. అందుకే ఆ నాలుగు జిల్లాల్లో ట్రాకింగ్‌, ట్రేసింగ్, టెస్టింగ్ లాంటి కొవిడ్ ప్రొటోకాల్స్‌ను కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ మధ్య భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలు తమ పనులకు ఆటంకం కలిగించాయని తెలిపారు. 
 
కాగా పూనెలో జికా వైరస్ కేసు కలకలం రేపిన అనంతరం కేంద్ర నిపుణుల బృందం పూణెలో పర్యటిస్తోంది. ముగ్గురు సభ్యుల టీమ్ తో పాటు పూనె డైరెక్టర్ కార్యాలయం నుంచి పబ్లిక్ నిపుణుడు, అలాగే న్యూఢిల్లీలోని లేడీ హార్డింగే మెడికల్ కాలేజీకి చెందిన గైనకాలజిస్ట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ నుండి ఓ సైంటిస్టు ఈ బృందంలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments