Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగికంగా వేధించారు.. అందుకే రాజీనామా చేశా : పుదుచ్చేరి మాజీ మంత్రి చంద్రప్రియాంక

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (08:16 IST)
తనను కులపరంగా, లైంగికంగా వేధించారని అందుకే తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు పుదుచ్చేరి మంత్రి వర్గంలో ఏకైక మహిళా మంత్రిగా ఉంటూ ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన చంద్రప్రియాంక సంచలన ఆరోపణలు చేశారు.
 
తాను మంత్రి పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలను ఆమె తాజాగా వెల్లడించారు. లైంగిక వేధింపులకు గురైనందుకే తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. ఎన్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆమె ముఖ్యమంత్రి ఎన్.రంగాస్వామికి అత్యంత సన్నిహితురాలు. పైగా, పుదుచ్చేరి రాష్ట్రంలో నాలుగు దశబ్దాల తర్వాత ఓ మహిళకు మంత్రివర్గంలో చోటుదక్కింది. అలాంటి మహిళా మంత్రి రాజీనామా చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, అణగారిన వర్గానికి చెందిన నేను కలపరంగా, లైంగికంగా వేధింపులకు గురయ్యాను. కొన్ని ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ మంత్రిగా కొనసాగలేను. పైగా, గ్రూపు, కక్ష రాజకీయాల్లో ఇమడలేక బయటకు వచ్చేశాను అని చంద్రప్రియాంక రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే, ఓ మహిళా మంత్రిని ఇబ్బంది పెట్టింది ఎవరన్న విషయంపై ఇపుడు సర్వత్రా చర్చసాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం