Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇచ్చే హామీలు అమలు సాధ్యం కాదని తెలిసినా హామీలు గుప్పిస్తున్నాయి : సీఈసీ

rajiv kumar
, మంగళవారం, 10 అక్టోబరు 2023 (12:10 IST)
ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు అమలు చేయడం సాధ్యం కాదని తెలిసినా ఇబ్బడిముబ్బడిగా హామీలను గుప్పిస్తున్నాయని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ గాంధీ అన్నారు. ఉచిత హామీలు ప్రజాకర్షణకు తాలింపు వంటివన్నారు. గెలిచిన తర్వాత వాటిని అమలుచేయడం సాధ్యం కాదని తెలిసినా రాజకీయ పార్టీలు హామీలను ప్రకటించడం మాత్రం మానుకోవడం లేదని అన్నారు. ఒక రాష్ట్రంలో ఒక హామీ, మరో రాష్ట్రంలో ఇంకో హామీ ఇస్తుంటాయని ఆరోపించారు. 
 
రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలపై ఆయన స్పందించారు. అధికారంలోకి రావడం కోసం అమలు చేయడం సాధ్యం కాని హామీల వరాలను కురిపిస్తాయని చెప్పారు. ఇలాంటి హామీలను నియంత్రించేందుకు బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని సీఈసీ స్పష్టం చేశారు. అయితే, ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటిలోగా, ఎలా అమలు చేస్తారో ప్రజలకు వివరించాల్సిగా ఒక నిర్ణీత నమూనాను ఇటవలే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వివరించారు. ఎన్నికల్లో గెలిచాక ఏం చేయబోయేది చెప్పే స్వేచ్ఛ పార్టీలకు ఉందని, అదేవిధంగా ఎన్నికల హామీలను ఎలా అమలు చేస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని రాజీవ్ కుమార్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన సీఎం కేసీఆర్ సతీమణి