Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరిలో పూర్తిస్థాయి లాక్డౌన్.. ఈ నెల 23 నుంచి 26 వరకు..?

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (18:40 IST)
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శుక్రవారం రాత్రి నుంచి సోమవారం వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ నెల 23 రాత్రి 10 గంటల నుంచి 26 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ అమలు కానుంది. 
 
పుదుచ్చేరిలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే లాక్‌డౌన్ ఆదేశాలు వెలువడడం గమనార్హం. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు నిన్న పుదుచ్చేరి అధికార యంత్రాంగం ప్రకటించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. రాత్రి 10 గంటలకల్లా ఇళ్లకు చేరుకునే విధంగా దుకాణదారులు తమ సమయాలను మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
హోటళ్లలో డైనింగ్ సర్వీసులు రాత్రి 8 గంటల కల్లా ముగించాలనీ.. హోం డెలివరీని 10 గంటల కల్లా పూర్తిచేయాలని అధికారులు ఆదేశించారు. కాగా పుదుచ్చేరిలో నిన్న కొత్తగా 4,692 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments