Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ ఓ హిందువు అనేందుకు రుజువేంటి : కేంద్ర మంత్రి అనంతకుమార్

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (11:13 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఓ  హిందువు అనేందుకు ఎలాంటి రుజువులు ఉన్నాయంటూ ఆయన ప్రశ్నించారు. 
 
భారత వైమానిక దళం జరిపిన మెరుపుదాడులపై రాహుల్ చేసిన విమర్శలపై ఆయన మాట్లాడుతూ, రాహుల్ పక్కా హైబ్రీడ్ వ్యక్తి.. ఒక ముస్లిం తండ్రి, క్రైస్తవ తల్లికి జన్మించిన వ్యక్తి అంటూ ఎద్దేవా చేశారు. తనకు తాను జంధ్యం ధరించిన హిందువునని ప్రకటించుకున్న ఈ ముస్లిం (రాహుల్).. తండ్రి ముస్లిం, తల్లి క్రైస్తవురాలు.. హిందువు అని రుజువు చేసుకునేందుకు ఈయన వద్ద ఆధారాలున్నాయా? అని ప్రశ్నించారు. 
 
రాహుల్ తండ్రి రాజీవ్ హత్యకు గురైనప్పుడు ఆయన శరీర భాగాలు చెల్లా చెదురయ్యాయి. ఆయన మృతదేహాన్ని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. అప్పుడు సోనియా కూడా డీఎన్‌ఏ పరీక్ష కోసం ప్రియాంక రక్త నమూనాలను తీసుకోవాలని చెప్పారు. రాహుల్‌ను వద్దని అన్నారు. ఇది రికార్డుల్లో ఉంది. ఇటువంటి హైబ్రీడ్ వ్యక్తి ఐఏఎఫ్ వైమానిక దాడులపై ఆధారాలు అడుగుతారా? అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మైథలాజికల్ థ్రిల్లర్ మయూఖం

గ్రాండ్ పేరెంట్స్‌‌కి ఉచితంగా ప్రదర్శించనున్న త్రిబాణధారి బార్బరిక్ టీం

రోషన్ కనకాల.. మోగ్లీ గ్లింప్స్ లాంచ్ చేసిన రామ్ చరణ్.. నాని వాయిస్ ఓవర్

బాహుబలి తర్వాత కుటుంబంతో చూసేలా లిటిల్ హార్ట్స్ - ఆదిత్య హాసన్, సాయి కృష్ణ

నా చిత్రాలేకాదు కొత్తవారికి అవకాశం కోసమే నిర్మాణసంస్థ ప్రారంభించా : రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments