Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్ కిచెన్‌లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపాల్.. వీడియో వైరల్

సెల్వి
గురువారం, 18 ఏప్రియల్ 2024 (20:52 IST)
Principal
పాఠాలు నేర్పించాల్సిన టీచర్.. హ్యాపీగా స్కూల్ కిచెన్‌లో ఫేషియల్ చేయించుకుంది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఒక పాఠశాలలో విద్యార్థులు తమ ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకోవడంలో బిజీగా ఉన్నారు. ఆపై ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీసి నెట్టింట పోస్టు చేశారు. 
 
ఉన్నావ్ జిల్లాలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతా సింగ్ విద్యార్థులకు బోధించాల్సి ఉండగా ఫేషియల్ చేయించుకుందని పోలీసు అధికారులు తెలిపారు. బిఘపూర్ బ్లాక్‌లోని దండమౌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆహారం వండే ప్రాంతంలో బ్యూటీ ప్రొసీజర్ జరుగుతుండగా, సహాయక ఉపాధ్యాయుడు అనమ్ ఖాన్ దానిని వీడియో తీశారు. ఈ వీడియోలో, షాక్ అయిన టీచర్ కుర్చీలో నుండి హడావిడిగా లేవడం చూడవచ్చు.
 
దండమావు గ్రామంలోని పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్నారని, ఆ సమయంలో పట్టుకున్నప్పుడు దాడి చేశారని ఆ పాఠశాల అసిస్టెంట్ టీచర్ నుంచి ఫిర్యాదు అందిందని, ఈ ఫిర్యాదు ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని బిఘపూర్ సర్కిల్ ఆఫీసర్ మాయా రాయ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments