Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణిని కాటేసిన కరోనా వైరస్.. నిండు గర్భిణి బలి

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (11:05 IST)
కరోనా వైరస్ నిండు గర్భిణి మహిళను కాటేసింది. కరోనా వైరస్‌ కాటుకు తొమ్మిది నెలల నిండు గర్భిణి బలైంది. ముంబైలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లసోపారా ప్రాంతానికి చెందిన ఓ మహిళ శ్వాస తీసుకోవటంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న స్థితిలో శనివారం రాత్రి ముంబైలోని బివైఎల్‌ నాయర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
 
ఈమె పరిస్థితిని బట్టి కరోనా ఉండొచ్చని అంచనా వేసిన వైద్యులు ఆమెను వెంటనే ఐసోలేషన్‌ వార్డుకు తరలించి, అత్యవసర చికిత్స అందించారు. కరోనా నిర్ధారణ పరీక్ష కూడా చేశారు. అయితే ఆమె ఆరోగ్య స్థితి మరింత దిగజారటంతో... కొద్ది గంటల్లోనే మృతిచెందింది. 
 
గర్భంలోని శిశువు కూడా మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం వెలువడిన కొవిడ్‌-19 పరీక్షలో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, నాయర్‌ ఆస్పత్రికి తీసుకురావటానికి ముందు ఆమెను చేర్చుకోవటానికి రెండు ఆస్పత్రులు తిరస్కరించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments