Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‍ రాష్ట్రాన్ని జేడీయూ - ఆర్జేడీలు ముంచేశాయి : ప్రశాంత్ కిషోర్

ఠాగూర్
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (13:33 IST)
బీహార్ రాష్ట్రాన్ని జేడీయూ, ఆర్జేడీలు రెండు పార్టీలు ముంచేశాయని ప్రముఖ జాతీయ రాజకీయ వ్యూహకర్త, జన సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన గంటలోపే రాష్ట్రంలో మద్యం నిషేధం అమలు చేస్తామని ఆయన తెలిపారు. వచ్చే నెల రెండో తేదీకి తమ పార్టీ స్థాపించి ఒక యేడాది పూర్తవుతుందని, ఈ సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆయన చెప్పారు. 
 
అదేసమయంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తొమ్మిదో తరగతి ఫెయిలైన లీడర్ బీహార్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారనీ, ఆర్జేడీ, జేడీయూ రెండూ బీహార్ రాష్ట్రాన్ని ముంచేశాయని అన్నారు. బీహార్‌లో మధ్యనిషేధం అవసరంలేదని, తాము అధికారంలోకి వచ్చిన గంటలోపల నిషేధం ఎత్తివేస్తామన్నార
 
బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న జేడీయూతో పాటు ఆర్జేడీ కూడా రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ యాత్ర చేపట్టడంపై ప్రశాంత్ కిశోర్ వ్యంగ్యంగా స్పందించారు. కనీసం ఇలాగైనా ఆయన ఇల్లు వదిలి ప్రజల్లోకి రావడం సంతోషకరమని అన్నారు. తొమ్మిదో తరగతి కూడా పూర్తిచేయని వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడని సెటైర్ వేశారు. తేజస్వీ యాదవ్‌కు జీడీపీకి, జీడీపీ గ్రోత్‌కు తేడా తెలియదంటూ ఎద్దేవా చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డైరెక్ట‌ర్సే నాకు గురువులు : మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ అర‌సాడ‌

వంద రోజుల పాటు ఆలరించిన రియాలిటీ షో ... నేడు బిగ్‌బాస్ టైటిల్ ప్రకటన

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments