Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్టోశాట్-3 ప్రయోగం వాయిదా: ఇస్రో

Webdunia
శుక్రవారం, 22 నవంబరు 2019 (08:09 IST)
ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ కార్టోశాట్-3 ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ప్రకటించింది. ఈ నెల 25న ఉదయం 9:28 గంటలకు పీఎస్ ఎల్వీ సీ47 రాకెట్‌ ద్వారా ఈ శాటిలైట్స్‌ను ప్రయోగించాలని ఇది వరకే నిర్ణయించింది.

అయితే కొన్ని కారణాల వల్ల రాకెట్ లాంచ్ వాయిదా వేస్తున్నట్లు ఇవాళ తెలిపింది. నవంబరు 27న ఉదయం 9:28 గంటలకు రాకెట్ ప్రయోగించబోతున్నామని ప్రకటించింది. ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని రాకెట్ స్టేషన్‌లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్ ఎల్వీ సీ47 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

అయితే వాతావరణ అనుకూలిస్తే 25న ప్రయోగం చేపడుతామని గతంలో చెప్పిన ఇస్రో.. ప్రస్తుతం వాయిదా వేయడానికి కారణం వెల్లడించలేదు.
 
కార్టోశాట్-3 ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన 13 వాణిజ్యపరమైన నానో శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి పంపనున్నది ఇస్రో. కార్టోశాట్-3ని 509 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఇస్రో ప్రవేశపెట్టనుంది. హై రెజొల్యూషన్ ఇమేజింగ్ క్యాపబిలిటీ టెక్నాలజీ ద్వారా భూ ఉపరితల ఫొటోలను ఈ శాటిలైట్ తీస్తుంది.
 
రాకెట్ లాంచింగ్ నేరుగా చూడొచ్చు
కార్టోశాట్ ప్రయోగాన్ని నేరుగా చూడాలనుకునే వాళ్లకు ఇస్రో ప్రత్యేకమైన అవకాశం కల్పిస్తోంది. శ్రీహరికోట రాకెట్ స్టేషన్‌లోని లాంచ్ వ్యూ గ్యాలరీలో కూర్చుని ప్రయోగం చూడొచ్చు.

ఆసక్తి ఉన్నవాళ్లు ఇస్రో సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. సాధారణంగా శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి వెళ్లడం మామూలు ప్రజలకు అంత ఈజీ పని కాదు. ఇస్రో ఇచ్చిన ఈ అవకాశంతో అంతరిక్ష ప్రయోగాలపై ఆసక్తి ఉన్న సామాన్యులు నేరుగా అక్కడికి వెళ్లే చాన్స్ దొరుకుతోంది. నవంబరు 20 నుంచి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది ఇస్రో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments