దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఠాగూర్
శనివారం, 12 ఏప్రియల్ 2025 (13:28 IST)
దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని హెచ్చరించాయి. ఈ క్రమంలో రైల్వే శాఖను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. డ్రోన్, ఐఈడీతో దాడులు జరగొచ్చని వెల్లడించాయి. నదీ మార్గాల్లో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడవచ్చని హెచ్చరించాయి. ముంబైకి కీలక కుట్రదారు తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చి విచారిస్తున్న తరుణంలో ఈ అలెర్ట్ చేయడం గమనార్హం. 
 
గత 2008 నవంబరు నెల 26వ తేదీన 10 మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అరేబియా సముద్ర మార్గం మీదుగా ముంబైకి చేరుకుని ఆ తర్వాత ముంబై మహానగరంలో మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ దాడుల్లో దాదాపు 175 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 
 
అలాగే, 18 మంది భద్రతా సిబ్బంది కూడా అశువులు బాసారు. అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ విభాగం చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్‌లు అమరులయ్యారు. రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు కాదా. 26/11 ముంబై దాడుల్లో కీలక పాత్రను పోషించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్.. భార్యపై కేసు పెట్టాడు.. కారణం ఏంటంటే?

Sudheer Babu: ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ లేనివారికి కష్టం, అందుకే అలా మాట్లాడా : హీరో సుధీర్ బాబు

Chinmayi: సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన చిన్మయి శ్రీపాద

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments