సెప్టెంబర్ 30 వరకు ఈ-రిటర్నుల ధ్రువీకరణకు అవకాశం

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (12:29 IST)
2015-2016 మదింపు సంవత్సరం నుంచి 2019-2010 మదింపు సంవత్సరం వరకు ఈ-ఫైలింగ్‌ రిటర్న్‌ల వెరిఫికేషన్ల‌కు ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు అవకాశం కల్పించారు.

ఇప్పటికే 2015-16, 2016-17, 2017-18, 2019-20 మదింపు సంవత్సరాలకు సంబంధించి ఈ-ఫైలింగ్‌ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను వెరిఫికేషన్‌ చేసుకోని వారికి ఐటీ శాఖ ఈ అవకాశం ఇచ్చింది.
 
బెంగళూరులోని సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌కు ధ్రువీకరణ అనుమతి‌ కోసం వచ్చిన ఈ-ఫైలింగ్‌ రిటర్న్‌లు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సకాలంలో ఐటీఆర్‌-వీలను సమర్పించాలని, లేదంటే ఐటీఆర్‌లను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు.
 
పన్ను చెల్లింపుదారులు డిజిటల్‌ సంతకం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే ఆన్‌లైన్‌లోనే ఆధార్‌ ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. లేదంటే నెట్‌ బ్యాంకింగ్ ద్వారా,‌ బెంగళూరులోని సీపీసీకి సంతకం చేసిన ఐటీఆర్‌-వీ పత్రాలను పంపడం ద్వారా వెరిఫికేషన్‌ చేసుకోవచ్చు.
 
ఐటీఆర్‌లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన 120 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. బెంగళూరులోని సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌కు ధ్రువీకరణ అనుమతి‌ కోసం వచ్చిన ఈ-ఫైలింగ్‌లో జాప్యం నెలకొనడంతో అధికారులు  ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు ధ్రువీకరణ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments