Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెప్టెంబరు 30 నుండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

సెప్టెంబరు 30 నుండి  శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
, శనివారం, 27 జులై 2019 (20:55 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 30 నుండి అక్టోబ‌రు 8 తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు స్వామివారు వివిద‌ వాహనాల‌పై తిరుమాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 24న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, సెప్టెంబరు 29న అంకురార్పణం నిర్వహిస్తారు.
 
వాహనసేవల వివరాలు... 
 
30-09-2019 - ధ్వజారోహణం, పెద్దశేషవాహనం.
 
01-10-2019 - చిన్నశేష వాహనం, హంస వాహనం.
 
02-10-2019 - సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం.
 
03-10-2019 - కల్పవృక్ష వాహనం, స‌ర్వభూపాల వాహనం.
 
04-10-2019 - మోహినీ అవతారం, గరుడ వాహనం (రా.7 నుండి 12 వరకు)
 
05-10-2019 - హనుమంత వాహనం, స్వర్ణరథం (సా.4 నుండి 6 వరకు), గజవాహనం
 
06-10-2019 - సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం.
 
07-10-2019 - రథోత్సవం, అశ్వ వాహనం (ఉ.7.00 గంటలకు)   
 
08-10-2019 - చక్రస్నానం, ధ్వజావరోహణం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పక్క రాష్ట్రాలకూ సహకారం అందిస్తాం... విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు