త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశా... పాపాలన్నీ పోయాయి : పూనమ్ పాండే

ఠాగూర్
గురువారం, 30 జనవరి 2025 (16:49 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా, గంగా, యమున, బ్రహ్మపుత్ర నదులు కలిసే త్రివేణీ సంగమంలో కోట్లాది మంది భక్తులు స్నానం చేస్తున్నారు. అలాంటి భక్తుల్లో బాలీవుడ్ నటి పూనమ్ పాండే కూడా ఒకరు. ఆమె కూడా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. 
 
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా తన ఇన్‌స్టాస్టోరీలో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్న ఫొటోలను పంచుకున్నారు. ఈ ఫొటో క్యాప్షన్‌గా ‘నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి' అని రాశారు. పూనమ్ పాండే షేర్ చేసిన ఈ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
'నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి. జీవితాన్ని చాలా దగ్గరగా చూశా. ఇక్కడ 70 ఏళ్ల వృద్ధుడు చెప్పులేకుండా గంటల తరబడి నడుస్తాడు. ఇక్కడ విశ్వాసానికి హద్దులు లేవు. కుంభమేళాలో తమ ప్రాణాలు కోల్పోయిన వారికి మోక్షం దొరుకుతుందని ఆశిస్తున్నా. ఇక్కడి భక్తి నన్ను మూగబోయేలా చేసింది' అని పూనమ్ పాండే తన్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఇప్పుడు ఆమె పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
 
ఇక 45 రోజుల పాటు జరగనున్న మహా కుంభమేళాలో బుధవారం నాటికే 27 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 13న ప్రారంభమైన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. సుమారు 40 కోట్ల మంది వరకు భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ మహా కుంభమేళాలో బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు ఒకేసారి తరలిరావడంతో సంగం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరం.
 
కాగా, పవిత్ర స్నానం చేసిన సినీ ప్రముఖుల్లో బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని, దర్శకుడు కబీర్ ఖాన్, హాస్యనటుడు సునీల్ గ్రోవర్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, మరాఠీ దర్శకుడు ప్రవీణ్ తద్దే వంటి ప్రముఖులు ప్రయాగ్‌రాజ్‌‍, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ తదితరులు ఉన్నారు. 


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments