Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న ప్రధాని మోదీ...

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (10:07 IST)
భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ తొలిసారిగా తిరుమలకు రానున్నారు. ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు మోడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమలకు బయలుదేరుతారు. తిరుమల కొండపైకి చేరుకున్నాక మోడీ పద్మావతి అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. 
 
అక్కడి నుంచి నేరుగా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు రేణిగుంట నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. 
ప్రధాని పర్యటన ఖరారు కావడంతో రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు ఏర్పాట్లు ప్రారంభించాయి. ప్రధాని పర్యటన ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. 
 
మరోవైపు మోడీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఏపీ బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఢిల్లీలో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ వి. మురళీధరన్ నివాసంలో రాష్ట్రనేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్షీ నారాయణ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు ఈ భేటీలో పాల్గొని ప్రధాని తిరుమల పర్యటన, ఇతర అంశాలపై చర్చించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments