Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి వందే భారత్ నాలుగో రైలు.. త్వరలో సరకు రవాణా కోసం

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (09:16 IST)
దేశంలో సెమీ హైస్పీడ్ రైళ్లను భారతీయ రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. ఈ రైళ్లను వందే భారత్ పేరుతో నడుపుతోంది. ఇప్పటికే మూడు రైళ్లు పట్టాలెక్కాయి. గురువారం నాలుగో రైలును నడుపనున్నారు. ఈ రైలు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అందౌరా స్టేషన్‌ల మధ్య నడుపనున్నారు. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ఉనా జిల్లాలో జరుగనుంది. 
 
మరోవైపు, త్వరలోనే సరకు రవాణాకూ వందే భారత్‌ తరహా రైళ్లను తీసుకురావాలని రైల్వే శాఖ యోచిస్తోంది. తక్కువ సమయంలో సరకు రవాణా చేసేందుకుగానూ ఈ హైస్పీడ్‌ పార్సిల్‌ రైలు సేవలను మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. 
 
తొలి దశలో భాగంగా దిల్లీ ఎన్‌సీఆర్‌ నుంచి ముంబై వరకు సరకు రవాణా రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ఈ రైళ్లను తయారుచేస్తున్నారు. రైలులోని ఒక్కో కోచ్‌లో 1,800 మిల్లీమీటర్ల వెడల్పుతో ఉండే ఆటోమేటిక్‌ స్లైడింగ్‌ ప్లగ్‌ డోర్లు ఉంటాయట. పార్సిళ్లను సులువుగా లోడింగ్‌ / అన్‌లోడింగ్‌ చేసేలా రోలర్‌ ఫ్లోర్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments