Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐడీఎఫ్‌ డబ్ల్యుఎస్‌ 2022ను సెప్టెంబర్‌ 12న ప్రారంభించనున్న భారత ప్రధానమంత్రి

image
, శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (23:52 IST)
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన ఐడీఎఫ్‌ వరల్డ్‌ డే సదస్సు 2022ను గ్రేటర్‌ నోయిడా వద్ద ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో పాల పరిశ్రమలో అగ్రగామి నాయకులు, నిపుణులు, రైతులు, పాలసీ ప్లానర్లు పాల్గొనడంతో పాటుగా ‘పౌష్టికాహారం- జీవనోపాధి కోసం పాల ఉత్పత్తులు’ అనే అంశంపై చర్చించనున్నారు.
 
ఈ సదస్సులో గౌరవనీయ కేంద్ర హోం శాఖామాత్యులు అమిత్‌ షాతో పాటుగా కేంద్ర పశుసంవర్థక, డెయిరింగ్‌, మత్య్స శాఖామాత్యులు శ్రీ పర్షోత్తమ్‌ రూపాలా కూడా ప్రసంగించనున్నారు. వీరితో పాటుగా ఇంటర్నేషనల్‌ డెయిరీ ఫెడరేషన్‌ (ఐడీఎఫ్‌) అధ్యక్షులు పియర్‌ క్రిస్టియానో బ్రజాల్‌; కారోల్‌ ఎమ్నాడో, డైరెక్టర్‌ జనరల్‌, ఐడీఎఫ్‌; శ్రీ జితేందర్‌ నాథ్‌ స్వైన్‌, ప్రెసిడెంట్‌, ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఆఫ్‌ ఐడీఎఫ్‌ (ఐఎన్‌సీ- ఐడీఎఫ్‌) సెక్రటరీ, డీఏహెచ్‌డీ, శ్రీ మీనేష్‌ షా, సెక్రటరీ, ఐఎన్‌సీ- ఐడీఎఫ్‌ మరియు ఛైర్మన్‌ ఎన్‌డీడీబీ ఈ కార్యక్రమానికి సమన్వయం చేయనున్నారు.
 
ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాధ్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్‌ పటేల్‌ కూడా పాల్గొననున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 24 సెషన్స్‌ పౌష్టికాహారం- జీవనోపాధి కోసం పాల ఉత్పత్తులు నేపథ్యంతో జరుగనున్నాయి. వీటికి సమాంతరంగా మూడు టెక్నికల్‌ సదస్సులు సైతం జరుగుతాయి. మొత్తంమ్మీద 150 మందికి పైగా దేశీ, విదేశీ స్పీకర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్వీన్ ఎలిజబెత్ 2: కోట్ల మంది భారతీయుల హృదయాలను ఈ రాణి ఎలా గెలుచుకున్నారు