భార్య వచ్చాక తల్లిని నిర్లక్ష్యం చేయొద్దు : ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (13:30 IST)
తెలంగాణలో త్వర‌‌లో జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయాలతో చరిత్ర సృష్టించాలని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర ఎంపీల‌‌కు దిశానిర్దేశం చేశారు. ఎంపీలే తమ నియోజ‌‌క‌‌వ‌‌ర్గాల‌‌కు పూర్తి బాధ్యులుగా ఉంటార‌‌ని చెప్పారు. శనివారం పార్లమెంట్​ హౌస్ ​కాంప్లెక్స్​లో పార్టీ ఎంపీల ట్రైనింగ్​పోగ్రాం 'అభ్యాస్​ వర్గ'లో షా మాట్లాడారు. ఇందులో ఉభయసభలకు చెందిన 380 మంది పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా కొందరు ఎంపీల వైఖరిపై వస్తున్న ఆరోపణలపై షా సీరియస్ అయ్యారు. అధికారం చేపట్టామన్న పొగ‌‌రుతో వ్యవ‌‌హారించ‌‌వ‌‌ద్దని, ప్రజలతో మమేకం కావాలని హిత‌‌బోధ చేసిన‌‌ట్లు సమాచారం. ఎంపీలందరూ పార్లమెంట్‌‌కు విధిగా హాజరుకావాల్సిందేనని స్పష్టంచేశారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ ట్రైనింగ్ ​పోగ్రాంను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 
 
శిక్షణ తరగతుల్లో ప్రధానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ​స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. 'పార్టీ ఐడియాలజీ, ఆలోచనలే బీజేపీని ఇప్పుడీ స్థితికి చేర్చాయి. పార్టీ ఎదుగుదల వెనక కార్యకర్తల కృషి ఉంది తప్ప వారసత్వ రాజకీయాలో, ఏ ఒక్క కుటుంబమో లేదు. మన విజయం వెనకా ఉన్నది వారే.. కన్నతల్లిలా పెంచి, ఈ స్థాయికి చేర్చిన కార్యకర్తలను మరవొద్దు' అంటూ ప్రధాని పార్టీ ఎంపీలకు సూచించారు. భార్య వచ్చాక తల్లిని నిర్లక్ష్యం చేసినట్లు.. పదవి వచ్చాక కార్యకర్తలను చులకనగా చూడొద్దని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Mammootty: 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన మమ్ముట్టి భ్రమయుగం

Chinnay : రాహుల్ రవీంద్రన్, చిన్నయ్ వివాహంపై సెటైర్లు

Chandini Chowdary,: తరుణ్ భాస్కర్ క్లాప్ తో చాందినీ చౌదరి చిత్రం లాంచ్

Bandla Ganesh: వార్నింగ్ లు రాజకీయాల్లోనే సినిమాల్లో కాదు - హీరోలపైనా బండ్ల గణేష్ సెటైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments