Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన

ఠాగూర్
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (12:11 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 21వ తేదీ నుంచి విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. అమెరికా వేదికగా క్వాడ్ దేశాల సదస్సు జరుగనుది. ఇందులోపాల్గొనేందుకు ఆయన మూడు రోజుల పాటు అగ్రరాజ్య పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. విల్మింగ్టన్‌లో వేదికగా 4వ క్వాడ్ దేశాధినేతల సదస్సు జరుగనుంది. 
 
సెప్టెంబర 21న జరిగే క్వాడ్ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యమివ్వనున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని దేశాల అభివృద్ధి లక్ష్యాలకు, ఆకాంక్షలకు తోడ్పాటు అందించడంపై ఈ క్వాడ్ సదస్సులో చర్చించనున్నారు. కాగా, వచ్చే ఏడాది క్వాడ్ దేశాల సదస్సుకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ అంగీకరించింది.
 
అమెరికాలో జరిగే తాజా క్వాడ్ సమావేశంలో, బైడెన్ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ మరోమారు పోటీ చేయడంలేదన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు కూడా వీడ్కోలు పలకనున్నారు. క్వాడ్ దేశాల గ్రూపులో అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. 
 
ఇక, క్వాడ్ సదస్సు అనంతరం, ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 23వ తేదీన న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరుకానున్నారు. మెరుగైన రేపటి కోసం విభిన్న పరిష్కారాలు అనే అంశంపై ఈ ఐరాస సమావేశం ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments