Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో వాటర్ మెట్రో రైల్ సేవలు.. ప్రారంభించిన ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (15:16 IST)
దేశంలోనే తొలిసారి కేరళ రాష్ట్రంలో వాటర్ మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నీటిపై నడిచే మెట్రో సర్వీస్‌ సేవల ప్రారంభం కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ తీసుకుని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మెట్రో రైల్ సేవలు ఎలా పని చేస్తాయో ఓసారి చూద్ధాం. 
 
కేరళ రాష్ట్రం కలల ప్రాజెక్టుగా వాటర్ మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టారు. కోచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ దీని నిర్వహణ బాధ్యత చూసుకుంటుంది. కోచి వాటర్ మెటర్లో సర్వీస్‌లో బ్యాటరీల సాయంతో నడిచే 78 ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లు ఉంటాయి. వీటి కోసం 38 టెర్మినళ్ళను నిర్మించారు. కోచి చుట్టుపక్కల ఉండే 10 ద్వీపాలను కలుపుతూ ఈ వాటర్ మెట్రో రాకపోకలు సాగిస్తుంది.
 
ఈ ప్రాజెక్టు కోసం రూ.1136.83 కోట్లను వెచ్చించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జర్మనీకి చెందిన ఫండింగ్ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఇది పూర్తిగా విద్యుత్ సాయంతో పనిచేస్తుంది. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు. అలాగే, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. 
 
వాటర్ మెట్రో సర్వీస్‌తో కోచి పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని కేరళ ప్రభుత్వం భావిస్తుంది. దశల వారీగా ఈ సర్వీసు సంఖ్య పెంచుతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ప్రస్తుతం రోజుకు 12 గంటల పాటు ఈ మెట్రో రైల్ సర్వీసులు అందుబాటులోకి తెస్తున్నారు.
 
ఇందులో ఏసీ, వైఫై సౌకర్యం ఉంది. ఒక్కో బోటులో 50 నుంచి 100 మంది ప్రయాణించవచ్చు. ఇవి కనిష్టంగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతోను, గరిష్టంగా 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అత్యాధునిక భద్రత, సమాచార వ్యవస్థ వీటిలో ఉన్నాయి. 
 
కోచి వాటర్ మెట్రో సర్వీస్ ప్రారంభ టిక్కెట్ ధరను రూ.20 కాగా, గరిష్ట టిక్కెట్ ధరను రూ.40గా నిర్ణయించారు. టిక్కెట్లతో పాటు వారం, నెలవారీ, మూడు నెలల పాస్‌లను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. వారం రోజుల పాస్ ధర రూ.180గాను, నెలవారీ పాస్ ధర రూ.600, మూడులల పాస్ ధర రూ.1500గా ఖరారు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments