Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతకంతకూ పెరిగిపోతున్న ప్రధాని మోడీ పాపులారిటీ!!

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (09:12 IST)
సోషల్ మీడియాలోనే కాకుండా, పలు దేశాల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాప్యులారిటీ అంతకంతకూ పెరిగిపోతుంది. ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయినప్పటికీ మోడీ ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంటుంది. తాజాగా ఆయన ఎక్స్‌లో రికార్డు సృష్టించారు. తన ట్విట్టర్ ఖాతాను ఫాలో అయ్యే వారి సంఖ్య 10 కోట్ల మార్కును అధిగమించారు. దీంతో ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా అవతరించారు. దీనిపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు.
 
'నా ఫాలోవర్ల సంఖ్య వంద మిలియన్లు దాటిపోయింది. ఎక్స్ వంటి చురుకైన మాధ్యమంలో ఉండడం, చర్చలు, ఆలోచనలు పంచుకోవడం, ప్రజల ఆశీస్సులు, నిర్మాణాత్మక విమర్శలు... ఇలా ఎన్నో ఈ వేదిక ద్వారా పొందగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది' అంటూ ట్వీట్ చేశారు.
 
ఇక, భారత్‌లో విపక్ష నేత రాహుల్ గాంధీ 'ఎక్స్' ఫాలోవర్ల సంఖ్య 26.4 మిలియన్లు కాగా... ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కు 27.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఇండియా కూటమిలోని నేతలందరి ఎక్స్ ఫాలోవర్లను కలిపితే 9.5 కోట్లు కాగా... ప్రధాని మోడీ ఒక్కరే 10 కోట్లతో టాప్‌లో నిలవడం విశేషం. అలాగే, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కూడా ఆయన అధికమించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal engagment: నేడు నిశ్చితార్థం జరుపుకున్నవిశాల్, సాయి ధన్సిక

Chiru: అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన

Shilpa: సుధీర్ బాబు జటాధర నుంచి తాంత్రిక పూజ చేస్తున్న శిల్పా శిరోద్కర్‌ లుక్

Barbaric Review: మారుతి సమర్పించిన త్రిబాణధారి బార్బరిక్ మూవీ రివ్యూ

Honey Rose: బులుగు చీర, వాలు జడ, మల్లెపువ్వులు.. మెరిసిపోయిన హనీరోజ్ (Photos)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments