Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా ఉధృతి.. ప్రధాని మోదీ చిన్నమ్మ కోవిడ్‌తో కన్నుమూత

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (22:49 IST)
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగింది. ఆక్సిజన్ సపోర్ట్ అవసరమవుతున్న పేషెంట్ల సంఖ్య ఎక్కువవుతోంది. దేశవ్యాప్తంగా చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో పేషెంట్లు మృతి చెందారు.
 
ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మోదీ చిన్నమ్మ నర్మదా బెన్(80) మంగళవారం (ఏప్రిల్ 27) కరోనాతో మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆమె... అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.ఈ విషయాన్ని ప్రధాని సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ వెల్లడించారు.
 
'మా చిన్నమ్మ నర్మదాబెన్ న్యూ రణదీప్ కాలనీలో తన పిల్లలతో కలిసి నివసిస్తోంది. 10 రోజుల క్రితం కరోనాతో ఆరోగ్యం క్షీణించడంతో సివిల్ ఆస్పత్రిలో చేరింది. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచింది.' అని ప్రహ్లాద్ మోదీ తెలిపారు. నర్మదా బెన్ భర్త,ప్రధాని మోదీ తండ్రి దామోదర్ దాస్ సోదరుడు జగ్జీవన్‌దాస్ చాలా ఏళ్ల క్రితమే మరణించారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments