Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్ల కోసం టిప్పు సుల్తాన్ జయంతిని జరుపుతారా : నరేంద్ర మోడీ ధ్వజం

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు. ఓట్ల కోసం సుల్తాన్ జయంతి జరుపుతున్నారంటూ పరోక్షంగా టిప్పు సుల్తాన్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆదివారం

Webdunia
ఆదివారం, 6 మే 2018 (16:36 IST)
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు. ఓట్ల కోసం సుల్తాన్ జయంతి జరుపుతున్నారంటూ పరోక్షంగా టిప్పు సుల్తాన్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆదివారం చిత్రదుర్గలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
 
స్థానిక వీరవనిత ఒనాకె ఓబవ్వ పరాక్రమాన్ని గొప్పగా చెబుతూ, కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు. ఈమె టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీకి వ్యతిరేకంగా పోరాడారు. సుల్తాన్‌ల పాలనను ధీటుగా ఎదురించిన వీర వనిత ఒనాకె ఓబవ్వ గురించి చిత్రదుర్గ ప్రజలకు తెలుసన్నారు. ఆమె పరాక్రమానికి నా సెల్యూట్, అలాంటి వీరవనితను కాంగ్రెస్ నేతలు పట్టించుకోరు కానీ ఓట్ల కోసం సుల్తాన్‌ల జయంతి నిర్వహిస్తారంటూ మండిపడ్డారు.
 
బ్రిటిష్‌కు వ్యతిరేకంగా పోరాడిన వీరుడిగా కొందరు టిప్పు సుల్తాన్‌ను కీర్తిస్తారు. అయితే అదే టిప్పు సుల్తాన్ వేల మంది హిందువులు, క్రిస్టియన్లను చంపాడని బీజేపీ, సంఘ్ పరివార్ ఆయనను ద్వేషిస్తాయి. అయితే ఆ సుల్తాన్ జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని నిర్ణయించి కర్ణాటక సీఎం సిద్దరామయ్య విమర్శలపాలైన విషయం తెల్సిందే. కానీ, కర్ణాటక ఎన్నికల వేళ టిప్పు సుల్తాన్ అంశం తెరపైకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments