'స్వచ్ఛతా హీ సేవా'కు సాయం చేయండి.. మోహన్‌లాల్‌కు ప్రధాని లేఖ

ఆయన దేశ ప్రధానమంత్రి. మరొకరు మలయాళ సూపర్ స్టార్. వారిద్దరు ఎవరో కాదు నరేంద్ర మోడీ. మరొకరు మోహన్ లాల్. కానీ, దేశ ప్రధానమంత్రిని కలుసుకునే భాగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుంటారు. ఆయన సాయం కోసం ఆరాటప

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (11:01 IST)
ఆయన దేశ ప్రధానమంత్రి. మరొకరు మలయాళ సూపర్ స్టార్. వారిద్దరు ఎవరో కాదు నరేంద్ర మోడీ. మరొకరు మోహన్ లాల్. కానీ, దేశ ప్రధానమంత్రిని కలుసుకునే భాగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుంటారు. ఆయన సాయం కోసం ఆరాటపడుతుంటారు. కానీ, ఒక దేశ ప్రధానే స్వయంగా దిగివచ్చి స్టార్ హీరోను సాయం చేయాలని కోరితే. అలాంటి సంఘటనే ఒకటి ఇపుడు చోటుచేసుకుంది. 
 
ప్రముఖ దక్షిణాది నటుడు మోహన్ లాల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఓ లేఖను రాస్తూ, తన కార్యక్రమాల్లో భాగస్వామిగా మారి సహకరించాలని కోరారు. కేంద్రం తలపెట్టిన 'స్వచ్ఛతా హీ సేవా'లో మోహన్ లాల్ సహకారాన్ని కోరుకుంటున్నట్టు తెలిపారు. 
 
తాను రాసిన లేఖలో "దేశాన్ని పరిశుభ్రంగా చేయడం ద్వారా పేదలకు ఎంతో సేవ చేసినట్టు అవుతుంది. చిత్ర రంగంలో మీకు ఎంతో ప్రత్యక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుతో ప్రజల జీవితాల్లో మీరు పాజిటివిటీని నింపవచ్చు. ఆ శక్తి మీకుంది. స్వచ్ఛతా హీ సేవా వంటి మంచి కార్యక్రమానికి మీరు సహకరించాలి. స్వచ్ఛ భారత్ సాధన దిశగా మీరు కొంత సమయం కేటాయించాలని నేను కోరుకుంటున్నాను. మీరు ముందడుగు వేస్తే, లక్షల మంది మీ వెంట కదిలొస్తారు. ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది" అని అన్నారు. అయితే, మోడీ రాసిన లేఖపై మోహన్ లాల్ స్పందించాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

ఆస‌క్తి హ‌ద్దులు దాటితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే నయనం ట్రైలర్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం

Roshan: ఛాంపియన్ నుంచి మనసుని హత్తుకునే పాట సల్లంగుండాలే రిలీజ్

Harsha Chemudu: ఇండస్ట్రీలో ఒక్కో టైమ్ లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది : హర్ష చెముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments