Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాడు రమ్మని పిలవడం లేదు.. నేనెలా చేరను...

హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరికపై నటుడు నాగబాబు తన మనసులోని మాటను వెల్లడించారు. పవన్ పిలవకుండా పార్టీలో ఎలా చేరను అంటూ ప్రశ్నించాడు. పవన్ ఆహ్వానిస్తే మాత్రం ఖచ్చితంగా జనసేనలో చేరుతా

వాడు రమ్మని పిలవడం లేదు.. నేనెలా చేరను...
, బుధవారం, 6 సెప్టెంబరు 2017 (11:47 IST)
హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరికపై నటుడు నాగబాబు తన మనసులోని మాటను వెల్లడించారు. పవన్ పిలవకుండా పార్టీలో ఎలా చేరను అంటూ ప్రశ్నించాడు. పవన్ ఆహ్వానిస్తే మాత్రం ఖచ్చితంగా జనసేనలో చేరుతానని స్పష్టంచేశారు. 
 
తాజాగా నాగబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జనసేనలో పనిచేయాలని తమ్ముడు కోరుకుంటే, తాను పార్టీలో చేరడానికి సిద్ధమేనని తెలిపారు. అందరిలా తాను పార్టీలో చేరడానికి తాను పబ్లిక్ కాదని... పవన్‌కు తాను అన్నయ్యనని గుర్తు చేశారు. పవన్ పిలిస్తే ఓ కార్యకర్తలా పని చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. 
 
పవన్ తనను పార్టీలోకి ఆహ్వానించకపోవడానికి కారణం ఉందన్నారు. తాను జీవితంలో పడిన కష్టాలేనని చెప్పారు. ఇకపై తాను ఎలాంటి కష్టాలు పడకూడదనే ఆలోచనతోనే పవన్ తనను పార్టీలోకి పిలవలేదని తెలిపారు. జనసేనలో చేరడం వల్ల పవన్‌కు తాను ప్లస్ కాకున్నా పర్వాలేదు కానీ... మైనస్ మాత్రం కాకూడదని చెప్పారు. 
 
అంతేకాకుండా, గతంలో తాను నిర్మించిన 'ఆరెంజ్' సినిమా వల్ల చాలా నష్టపోయానని... అప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్ తనకు అండగా ఉన్నప్పటికీ, ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలనే బాధతో చాలా కాలం గడిపానని నాగబాబు అన్నారు. బుల్లితెర సహాయంతోనే తాను పరిస్థితులను అధిగమించానని నాగబాబు వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విడాకులు తీసుకున్నా... సన్నిహితంగానే ఉంటున్నాం.. సంగీతా బిజ్లానీ