చైనాకు చెక్ : రిపబ్లిక్ వేడుకలకు 10 దేశాధినేతలు.. మోడీ నిర్ణయం
గతానికి భిన్నంగా ఈదఫా భారత రిపబ్లిక్ వేడుకలకు 10 దేశాధినేతలను అతిథులుగా ఆహ్వానించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయించినట్టు సమాచారం. ఇదే నిజమైతే వచ్చేయేడాది జనవరి 26వ తేదీన జరిగే ఈ వేడుకలు
గతానికి భిన్నంగా ఈదఫా భారత రిపబ్లిక్ వేడుకలకు 10 దేశాధినేతలను అతిథులుగా ఆహ్వానించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయించినట్టు సమాచారం. ఇదే నిజమైతే వచ్చేయేడాది జనవరి 26వ తేదీన జరిగే ఈ వేడుకలు ఆగ్నేయాసియా దేశాల కూటమికి చెందిన 10 దేశాల అధినేతలు హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ పది దేశాల్లో బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం ఉన్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రపంచ దేశాలతో మైత్రిని పెంపొందించుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులోభాగంగా ఆగ్నేయాసియా దేశాలతో సత్సంబంధాలకు మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
దీనికి కారణం లేకపోలేదు. దక్షిణ చైనా సముద్ర జలాల విషయంలో చైనాకు ఆగ్నేయాసియా దేశాలకు మధ్య ఉద్రిక్తత నెలకొనివుంది. దీనికితోడు సరిహద్దు సమస్యలు ఎదురవుతుండటం, ఇటీవల భారత్‌తో కూడా చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆగ్నేయాసియా దేశాలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించనుండటం గమనార్హం.
నిజానికి ప్రతి గణతంత్ర వేడుకలకు ఒక దేశాధినేతను అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, 2018లో నిర్వహించే ఈ వేడుకలకు ఆసియాన్ దేశాలకు అధినేతలను ఆహ్వానించాలనుకోవడం ఇదే మొదటిసారి.