Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌జీ వ్యసనం.. రైలు వస్తున్నా పట్టించుకోలేదు.. వేగంగా వచ్చిన రైలు..?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (15:19 IST)
పబ్‌జీ వ్యసనంలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. హింగోలిలోని ఖట్‌కలి బైపాస్‌ సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, నగేశ్‌ గోరి(24), స్వప్నిల్ అన్నపూర్ణె (22) అనే యువకులు హింగోలికి సమీపంలో ఉన్న రైలు పట్టాల వద్ద పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారు. గేమ్ మాయలో పడి చుట్టు ప్రక్కల జరుగుతున్నవి గమనించలేదు. 
 
రైలు వస్తున్న విషయం కూడా తెలుసుకోలేకపోయారు. ఆ సమయంలో అటు నుండి వేగంగా వస్తున్న హైదరాబాద్‌- అజ్మేర్‌ రైలు వీరిని ఢీకొట్టింది. యువకులు ఇద్దరూ అక్కడికక్కకే మరణించారు. కొన్ని గంటల తర్వాత స్థానికులు మృత దేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఇటీవల కాలంలో బాగా ప్రాచూర్యం పొందిన పబ్జీ గేమ్ వల్ల అనేక మంది పిల్లల ప్రవర్తన మారిపోతోందని, చివరికి ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయని, దానిని వెంటనే నిషేధించాలని కొంత మంది తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీ : సినీ నటి హేమ మా నుంచి సస్పెండ్?

2024 ఎన్నికల్లో ఓటమి.. మళ్లీ జబర్దస్త్ షోకు ఆర్కే రోజా?

విజయ్ సేతుపతి 50వ మైల్ స్టోన్ మూవీ 'మహారాజా

విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ కొత్త మిషన్ బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై విల్ విల్ రిలీజ్

లస్ట్ కోసం కాదు.. లవ్ కోసం చేసిన సినిమా ‘లవ్,మౌళి’: దర్శకుడు అవ‌నీంద్ర

మలబార్ స్పెషల్.. మత్తి చేపల పులుసు.. మహిళలకు ఎంత మేలంటే?

'మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్‌'లో టైమ్‌లెస్ బ్యూటీగా చెన్నై మహిళ

ఈ రసం తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే 7 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments