Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబ్ద కాలుష్యానికి చెక్ : హారన్ శబ్దాలకు వాయిద్య సంగీతం

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (10:45 IST)
దేశంలో వాహనాల రద్దీ నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్‌ పెరిగిపోతోంది. దీంతో శబ్ద కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వివిధ రకాల వాహనాల హారన్‌ శబ్దాల స్థానంలో వినసొంపైన తబలా, తాల్, వయోలిన్, బుగ్లే, ఫ్లూట్ వంటి వాయిద్య సంగీతం విన్పించేందుకు కేంద్రం కొత్త నిబంధనలను అమలు చేయనుంది. 
 
వాహనాల హారన్ల శబ్దానికి సంబంధించి కొత్త నిబంధనలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఇకపై హారన్ సౌండ్​లో సంగీతం, వాయిద్య సంగీతం విన్పించనుంది. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చొరవతో ఈ నిబంధనలను అధికారులు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇటీవల నాసిక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నితిన్​ గడ్కరీ.. సౌండ్ పొల్యుషన్ గురించి మాట్లాడుతూ.. వాహన హారన్​లను మార్చబోతున్నట్లు వెల్లడించారు. వాహనాల హారన్ల స్థానంలో ఆకాశవాణి‌లో వచ్చే సంగీత వాయిద్యం ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలో వాహనాల హారన్ రోటీన్ శబ్దం నుంచి బయటపడతారని ఆయన వెల్లడించారు. తన మంత్రిత్వ శాఖ అధికారులు కార్ హారన్​ల శబ్దాన్ని మార్చే పనిలో ఉన్నట్లుగా ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments