Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ స్విచాఫ్ చేసి రెడీగా వుండు... ఎగిరి గంతేసిన యువకుడు, కరెంట్ తీసి కత్తితో పొడిచింది

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (13:27 IST)
బెంగుళూరు నగరంలోని బనశంకరి ఏరియా సంపూర్ణ మార్కెట్ ప్రాంతం. ఉన్నట్లుండి పోలీసు జీపు వచ్చి ఆగింది. పోలీసులు గబాగబా పరుగెత్తుకుంటూ పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ లోకి వెళుతున్నారు. ఏం జరిగిందో స్థానికులకు అర్థం కాలేదు. ఐదుమంది యువకుల శవాలను బయటకు తీసుకొచ్చారు. ఒక యువకుడు ఒళ్ళంతా రక్తంతో బయటకు వచ్చాడు. 
 
అతని పేరు రోషన్. ఒక ప్రైవేటు కంపెనీలో ఫుడ్ డెలివరీ బాయ్. గత నెల రోజుల నుంచి ఇదే పనిచేస్తున్నాడు. ఫుడ్ ఆర్డర్ తీసుకొని అందరికీ అందిస్తుంటాడు. ఎప్పటిలాగే బనశంకరి ఏరియా సంపూర్ణ మార్కెట్ ప్రాంతంలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చినట్లు మెసేజ్ వచ్చింది. ఆ ఫుడ్ తీసుకొని అపార్టమెంట్‌కు వెళ్ళాడు.
 
అయితే అక్కడో ఆ అమ్మాయి.. పేరు జర్సి. ఆ యువకుడిని లోపలికి రమ్మంది. సరేనని లోపలికి వెళ్ళి పార్సిల్ ఇచ్చాడు. కూర్చో అంటూ చైర్ ఇచ్చింది. వంట గదిలోకి వెళ్ళి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. కాఫీ తాగుదామా అంటూ ప్రేమగా అడిగింది. దీంతో రోషన్‌కు ఏమీ అర్థం కాలేదు.
 
ఆ యువతి తనను కోరుకుంటుందేమోనని అనుకున్నాడు. మెల్లగా మాటల్లో దించాడు. ఆమె కూడా రోషన్‌తో మాట్లాడుతూనే ఉంది. నేను ఫ్రెష్ అయి వస్తా. నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నాకివ్వు అంది. ఇంకేముంది రోషన్ వేయి గుర్రాలు ఎక్కినంత హుషారుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆమె కోసం బెడ్రూంలో వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. ఇంతలో కరెంట్ పోయింది. చిమ్మ చీకటి. హఠాత్తుగా వెనుక నుంచి కత్తితో గట్టిగా పొడిచినట్లు అనిపించింది. 
 
తిరిగి చూస్తే జర్సి. ఏం చేస్తున్నావంటూ గట్టిగా అరిచాడు. అంతలోనే అతడి శరీరంలో మూడు ప్రాంతాల్లో పొడిచేసింది. ఆమె నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ గదిలో ఆమెను తోసేశాడు. వెంటనే మెయిల్ ద్వారా తన స్నేహితుడికి మెసేజ్ చేశాడు. తాను ఆపదలో ఉన్నానని అడ్రస్ పంపాడు. 
 
అన్ని తలుపులు మూసి వేసి తాళాలు వేయడంతో ఎక్కడా బయటకు వెళ్ళలేకపోయాడు. ఇంతలో పోలీసులు ఆ అపార్టుమెంట్‌కు వచ్చారు. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం ఐదుగురి యువకుల శవాలు కనిపించాయి. జర్సి ఒక సైకో కిల్లర్. మానసికంగా ఆమెకు మెచ్యూరిటీ లేదని పోలీసులు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments