Webdunia - Bharat's app for daily news and videos

Install App

చార్ ధామ్ యాత్రకు అనుమతి

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (13:01 IST)
కరోనా కేసులు తగ్గుతుండటంతో నేటి నుండి ఈ యాత్రకు అధికారులు అనుమతి ఇచ్చారు. హై కోర్ట్ నిషేధం ఎత్తివేసిన తరువాత ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ యాత్రకు అనుమతి ఇచ్చింది. అయితే కనీస నిబంధనలు పాటించాలని సూచించింది.

కరోనా లేదనే సర్టిఫికెట్, వాక్సినేషన్ అయిన వారు ఆయా సర్టిఫికెట్ చూపించి యాత్రకు సిద్ధం అవ్వాలని భక్తులకు అధికారులు సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు, యాత్రికులు స్మార్ట్ సిటీ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకొని అనుమతి పొందాలని హై కోర్టు సూచించింది.

ఈ యాత్ర కోసం ప్రతి రోజు బద్రీనాథ్ లో వెయ్యి మంది, కేదార్నాద్ లో 800 మంది, గంగోత్రిలో 600 మంది, యమునోత్రిలో 400 మంది కి మాత్రమే అనుమతి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దరఖాస్తు దారులు తమకు రెండు డోసుల వాక్సినేషన్ పూర్తి అయినట్టు ఆయా పత్రాలు చూపించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  కనీసం పదిహేను రోజుల ముందు ఇవన్నీ జరిగితే బాగుంటుందని వారు చెప్పారు.

యాత్రికులు యాత్రాస్థలిలో ఏ స్నానఘట్టంలో కూడా స్నానాలు ఆచరించరాదు అనేది ఇప్పటికే కోర్టు స్పష్టం చేసింది. రుద్రప్రయాగ్, చమేలీ, ఉత్తరకాశి జిల్లాలలో పోలీసులు యాత్ర సందర్భంగా భారీగా బలగాలను ఏర్పాటు చేశారు. తాజా ఆఫ్ఘన్ ఆక్రమణ సందర్భంగా దేశంలో హై అలర్ట్ విధించిన విషయం తెలిసిందే.

ఢిల్లీలో ఇప్పటికే ఆరుగురు తీవ్రవాదులను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని యాత్రకు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ప్రతి ఏడాది ఈ యాత్రకు సాధారణంగానే యాత్రికుల అర్హతను బట్టి అనుమతి ఇస్తున్నారు. ఎవరు బడితే వాళ్ళు ఈ యాత్రకు రానివ్వరు, కేవలం స్థిరమైన ఆరోగ్యం ఉన్న వారికే ఈ అనుమతి లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అప్పుడు అనుష్క తో ఛాన్స్ మిస్ అయ్యా, గోనగన్నారెడ్డి గా నేనే చేయాలి : విక్రమ్ ప్రభు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

తర్వాతి కథనం
Show comments