Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతూ వెళ్ళింది.. ఖాకీ వీరంగం.. జుట్టుపట్టుకుని.. ఫోను లాక్కుని?

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఎక్కడపడితే అక్కడ మాట్లాడుకునే వారు కొందరు. నడుచుకుంటూ మాట్లాడే వాళ్లు మరికొందరు. ముందు వెనకా ఏం జరుగుతోంది. ఇంకా ఫోను ఆన్ చేసి చెవిదగ్గర పెడితే ఈ లోకాన్ని మరిచిపోయేవారు చాలామంద

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (17:13 IST)
స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఎక్కడపడితే అక్కడ మాట్లాడుకునే వారు కొందరు. నడుచుకుంటూ మాట్లాడే వాళ్లు మరికొందరు. ముందు వెనకా ఏం జరుగుతోంది. ఇంకా ఫోను ఆన్ చేసి చెవిదగ్గర పెడితే ఈ లోకాన్ని మరిచిపోయేవారు చాలామందే వున్నారు. అయితే తాజాగా రోడ్డుమీద ఫోన్‌ మాట్లాడుకుంటూ వెళుతున్న యువతిపై ఓ పోలీసు అధికారి వీరంగం ప్రదర్శించాడు. మహిళ అని కూడా చూడకుండా.. బెదిరించి వదిలిపెట్టకుండా ఖాకీ కావరం చూపించాడు. జుట్టుపట్టుకుని ఈడ్చి పడేశాడు. 
 
బీహార్‌లోని నలంద ప్రాంతంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఫోన్‌లో బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడుకుంటూ వెళ్తున్న ఆమెను..  మఫ్టీ దుస్తుల్లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి కుమార్‌ ఆమెను చూశాడు. కోపంతో నడిరోడ్డుపై ఆమెను పట్టుకొని తీవ్రంగా కొట్టాడు. ఫోను లాక్కుని రోడ్డు మీదికి విసిరిపారేశాడు. నోటికొచ్చినట్లు క్యారెక్టర్ మంచిది కాదంటూ దూషించాడు. 
 
ఊహించని పరిణామంతో దిగ్భ్రాంతికి గురై ఆమె విలపించింది. తనను విడిచిపెట్టాల్సిందిగా అధికారిని వేడుకున్నా ఫలితం లేకపోయింది. చాలా సేపటికి తర్వాత ఆ పోలీసు ఆమెను విడిచిపెట్టాడు. ఈ తతంగం అంతా సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డు కావడంతో కుమార్ సస్పెండ్ అయ్యాడు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments