Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరిన విమానం... గగనతలంలో ప్రయాణికుడు మృతి!!

ఠాగూర్
శుక్రవారం, 21 మార్చి 2025 (12:03 IST)
ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు గగనతలంలో మృతి చెందాడు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ విమానం... శుక్రవారం ఉదయం 8.10 గంటలకు లక్నోలోని చరణ్ సింగ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. ప్రయాణికులు విమానం దిగుతున్న సమయంలో సీట్లు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ఓ ప్రయాణికుడు వద్దకు వెళ్లగా, అతడిలో ఎలాంటి చలనం లేకపోవడాన్ని గమనించి విమాన సిబ్బందికి సమాచారం చేరవేశాడు. దీంతో విమానంలో ఉన్న వైద్యులు అతడిని పరీక్షించగా మృతి చెందినట్టు ధృవీకరించారు. 
 
సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడిని ఢిల్లీకి చెందిన ఆసఫ్ ఉల్హా అన్సారీగా గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. విమానం ఎక్కిన తర్వాత అతడికి ఇచ్చిన ఆహార పదార్థాలు అలానే ఉండటం, సీటు బెల్టు కూడా తీయకపోవడంతో గాల్లో ఉన్న సమయంలో మృతి ేచెందివుంటాడని అనుమానిస్తున్నారు. అతడు మృతి చెందడానికి గల కారణాలు తెలియరాలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపామని తెలిపారు. అతడి కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం చేరవేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments