తప్పిపోయిన 20 ఏళ్ల భారతీయ విద్యార్థి సుధీక్ష కొనంకీ కుటుంబం డొమినికన్ రిపబ్లిక్‌లోని పోలీసులను తన చనిపోయినట్లు ప్రకటించాలని కోరినట్లు అమెరికా మీడియా నివేదికలు తెలిపాయి. దీనిపై డొమినికన్ రిపబ్లిక్ జాతీయ పోలీసు ప్రతినిధి డియెగో పెస్క్‌క్వీరా మాట్లాడుతూ, ఎంఎస్ కోనంకీ కుటుంబం మరణ ప్రకటనను కోరుతూ ఏజెన్సీకి ఒక లేఖ పంపినట్లు ఓ న్యూస్ ఛానల్ మంగళవారం నివేదించిందని చెప్పారు. మార్చి 6 తెల్లవారుజామున సుధిక్ష కోనంకి కనిపించకుండా పోయింది. అమెరికా పిట్స్ బర్గ్ యూనివర్సిటీలో చదువుతూ.. డొమినికన్ రిపబ్లిక్‌లో మిస్సైన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి కేసు మిస్టరీగా మారింది.
సుదీక్ష చివరిసారిగా కనిపించిన ప్యూంటా కానా బీచ్ దగ్గర ఆమె దుస్తులను అధికారులు గుర్తించారు. బీచ్ దగ్గరున్న లాంజ్ చైర్‌పై తెల్లటి నెటెడ్ సరోంగ్‌తో పాటు ఆమె ధరించిన పాదరక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత సంతతికి చెందిన యువతి తన దుస్తులను లాంజ్ చైర్‌పై వదిలివేసి, ఆపై గోధుమ రంగు బికినీలో సముద్రంలోకి దూకి, మునిగిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
మార్చి 6న స్థానికంగా ఉన్న రియూ రిపబ్లికా రిసార్ట్ బీచ్ దగ్గర చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత ఆమె గదికి తిరిగి రాకపోవడంతో స్నేహితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. సుదీక్ష.. ఐయోవాకు చెందిన 24 ఏళ్ల టూరిస్టు జాషువా స్టీవెన్ రిబెతో కలిసి బీచ్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో అతడిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. తమ కుమార్తెను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని సుదీక్ష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టాలని పోలీసులను కోరారు.