Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరుగు పయనమైన సునీతా విలియమ్స్

Advertiesment
space x

ఠాగూర్

, మంగళవారం, 18 మార్చి 2025 (12:08 IST)
దాదాపు తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకునిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచర ఆస్ట్రోనట్ బుచ్ విల్మోర్‌లు ఎట్టకేలకు భూమికి చేరుకోనున్నారు. వారిద్దరూ అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చి భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. వ్యోమగాములను భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్‌లోకి వారు సురక్షితంగా చేరుకున్నారు. ఆ తర్వాత ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి భూమికి పయనమైంది. 
 
ఐఎస్ఎస్‌ను స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వీడే అన్‌డాకింగ్ దృశ్యాలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రత్యక్ష ప్రసారం చేసిన విషయం తెల్సిందే. ఈ ప్రక్రియనంతా నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తలు సునిశితంగా గమనించారు. ఐఎస్ఎస్ నుంచి విడిపోయిన ఈ వ్యోమనౌక కక్ష్యలో తిరుగుతోంది. 
 
అంతకుముందు హ్యాచ్ మూసివేత ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు తమ వస్తువులను ప్యాక్ చేసుకుని క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. భూమ్మీదికి వచ్చే ముందు ఐఎస్ఎస్‌లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుని ఆనంద క్షణాలను గడిపారు. 
 
కాగా, భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.15 గంటలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది. ఇది పూర్తయిన తర్వాత ఉదయం 10.15 గంటలకు అన్‌డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. ఇక భూవాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ల ప్రజ్వలనను బుధవారం తెల్లవారుజామున 2.41 గంటలకు చేపట్టనున్నారు. దాదాపు 40 నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3.27 గంటలకు వ్యోమ నౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. 
 
సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్‌ను వెలికి తీస్తాయి. ఆ తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను పుడమిపై పాదం మోపుతారు. 2024 జూన్ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్‌లైనర్‌లో వీరిద్దరూ ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వీరిద్దరూ వారం రోజుల్లోనే తిరిగి భూమికి చేరుకోవాల్సి వుంది. కానీ, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి చేరుకుంది. నాటి నుంచి వీరిద్దరూ అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకునిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Ranya Rao : నన్ను అరెస్ట్ చేయకండి.. పెళ్లైన నెలలోనే విడిపోయాం.. కోర్టులో నటి రన్యా రావు భర్త