Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంచిన కుమార్తె పెళ్లికి నిరాకరించిందని తల్లిదండ్రులు ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (11:51 IST)
పెంచిన కుమార్తె పెళ్లికి నిరాకరించిందని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హాసన్ జిల్లా ఆలూరుకు చెందిన పుట్టరాజు(58), అతని భార్య కాంతమ్మ(53)కు సంతానం లేకపోవడంతో బంధువుల పిల్లల్లో ఒక బాలికను, బాబును తెచ్చుకుని పెంచుకున్నారు. 
 
ఇటీవలే కుమారుడికి పెళ్లి చేశారు. ప్రాణంగా పెంచుకున్న కుమార్తెకు కూడా వివాహం చేయాలని నిర్ణయించారు. పెళ్లి కుదిర్చి నిశ్చితార్థం విషయాన్ని కుమార్తెకు తెలిపారు.
 
అయితే.. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు అక్కడాఇక్కడా వెతికి ఆమెకు నచ్చజెప్పి ఎలాగోలా ఇంటికి తీసుకొచ్చారు. రాత్రి ఇంటికి తీసుకొచ్చాక ఈ పెళ్లి చేసుకోమని కుమార్తెను కోరారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడితే ఆత్మహత్య చేసుకుంటానని కుమార్తె బెదిరించింది. దీంతో.. తీవ్ర మనస్తాపం చెందిన పుట్టరాజు, కాంతమ్మ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
రాత్రి కుమార్తె నిద్రపోయిన తర్వాత పశువుల కొట్టంలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెల్లారాక గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments