Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారంపై ఆశ.. కుమార్తెను చంపి కళ్ళెదుటే అత్యాచారం.. గుడ్లప్పగించి చూసిన తల్లిదండ్రులు...

బంగారంపై ఆశతో కళ్లెదుటే కన్నబిడ్డపై అత్యాచారం జరుగుతుంటే ఆ తల్లిదండ్రులు మాత్రం గుడ్లప్పగించి చూస్తుండిపోయారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజి జిల్లాలో జరిగింది. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలన

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (17:36 IST)
బంగారంపై ఆశతో కళ్లెదుటే కన్నబిడ్డపై అత్యాచారం జరుగుతుంటే ఆ తల్లిదండ్రులు మాత్రం గుడ్లప్పగించి చూస్తుండిపోయారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజి జిల్లాలో జరిగింది. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ జిల్లాకు చెందిన మహావీర్‌ ప్రసాద్‌ అనే వ్యక్తి బంగారు వ్యాపారం చేస్తూ నష్టాలు రావడంతో ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయాడు. విషయం తెలిసిన కృష్ణ శర్మ అనే మంత్రగాడు తాను చెప్పినట్లు చేస్తే 5 కేజీల బంగారం దొరుకుతుందని ప్రసాద్‌ దంపతులను నమ్మించాడు. 
 
ఇందుకోసం 15 యేళ్ళ వయసున్న ప్రసాద్ కుమార్తె కవితతో త్యాగం పూజ చేయించాల్సి ఉంటుందని చెప్పడంతో ప్రసాద్ దంపతులు సమ్మతించారు. ఆ తర్వాత కవితకు మత్తు కలిపిన జలాన్ని మంత్రగాడు తాపించాడు. దీంతో ఆ యువతి అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రుల ఎదుటే మంత్రగాడు ఆ యువతిని వివస్త్రను చేసి అత్యాచారం చేశాడు. 
 
ఆ తర్వాత గొంతు నులిమి చంపేశాడు. ఆమె శవాన్ని పొలాల్లో పడేసే ముందు కూడా మరోమారు తల్లిదండ్రుల ఎదుటే అత్యాచారం జరిపాడు. బంగారం దొరక్కపోవడంతో తాము మోసపోయినట్టు గ్రహించిన ప్రసాద్ మంత్రగాడు కృష్ణ శర్మపై మహావీర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయంవెలుగు చూసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments