Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్రవాదుల అంతానికి పాకిస్థాన్‌లో సైతం ప్రవేశిస్తాం : రాజ్‌నాథ్ సింగ్

ఠాగూర్
శనివారం, 6 ఏప్రియల్ 2024 (10:04 IST)
తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి సరిహద్దులను దాటి పారిపోయేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, అవసరమైతే పాకిస్థాన్‌లో సైతం ప్రవేశిస్తామని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు పారిపోయినా వారిని ఏరివేసేందుకు ఆ దేశంలోకి ప్రవేశిస్తామని తెలిపారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని భారత్ ఎల్లప్పుడూ కోరుకుంటుందని అన్నారు. అయితే పదే పదే కవ్విస్తూ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తే మాత్రం విడిచిపెట్టే ప్రసక్తేలేదని ఆయన హెచ్చరించారు. 
 
విస్తృత ప్రణాళికలో భాగంగా విదేశీ గడ్డపై ఉగ్రవాదులను భారత్ ఏరివేస్తోందని, 2020 నుంచి పాకిస్థాన్ దేశంలో 20 మందిని మట్టుబెట్టిందంటూ బ్రిటన్‌కు చెందిన 'గార్డియన్' పత్రిక ఓ కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కథనంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించలేదు. పాకిస్థాన్ విదేశాంగ శాఖ కూడా స్పందించేందుకు నిరాకరించింది. కాగా 2019లో జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి బాంబు దాడి తర్వాత భారత్, పాక్ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.
 
కెనడా, అమెరికాలోని ఖలిస్థానీ టెర్రిరిస్టులను భారత్ చంపేస్తోందని, అంతమొందించడానికి ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు వచ్చిన కొన్ని నెలల తర్వాత గార్డియన్ పత్రికలో ఈ కథనం వెలువడింది. ఈ యేడాది ఆరంభంలో తమ భూభాగంపై ఇద్దరు పౌరుల హత్యలో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని పాకిస్థాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. అయితే పాక్ చేసిన ఈ ప్రకటనను భారత్ ఖండించింది. ఇది తప్పుడు ప్రచారమని తిప్పికొట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments