Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఎన్ని అన్యాయాలు చేసినా పవన్ కళ్యాణ్‌కు దేవుడే : పోసాని కృష్ణ మురళి

ఠాగూర్
శనివారం, 6 ఏప్రియల్ 2024 (09:34 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్ని అన్యాయాలు చేసినప్పటికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మాత్రం ఆయన దేవుడిగానే కనిపిస్తారని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఆయన ఏపీలో వాలంటీర్లు, పెన్షన్ల అంశంపై స్పందించారు. రాష్ట్రంలో వాలంటీర్లపై ఆంక్షలకు చంద్రబాబే కారణమని తెలిపారు. వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేలా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను పురికొల్పింది చంద్రబాబే అని ఆరోపించారు. వాలంటీర్ల సేవలు చూసి చంద్రబాబు ఓర్వలేక పోయారని, అందుకే ఇంటివద్దనే పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 
 
"ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు, రాజకీయ భవిష్యత్ కోసం నాడు రంగాను పొట్టనబెట్టుకున్నారు. ఇపుడు రాజకీయ కోసం పవన్ కళ్యాణ్‌ను లొంగదీసుకున్నారు. పవన్‌ను పక్కనబెట్టుకుని కాపులను తనకు ఊడిగం చేయించుకునేలా చేయాలన్నదే చంద్రబాబు ప్లాన్. చంద్రబాబు గతంలో కాపులను రౌడీలు అనలేదా, చంద్రబాబు ఎన్ని అన్యాయాలు చేసినా పవన్ కళ్యాణ్‌కు మాత్రం ఆయన దేవుడు అంటూ పోసాని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఏనాడైనా సొంతంగా ఒక పార్టీ పెట్టాడా, కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు... తన రాజకీయ భవిష్యత్ కోసం ఏమైనా చేస్తారు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments