Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎడ్లబండికి ఫైన్.. నో పార్కింగ్ జోన్‌లో వుండటంతో.. జరిమానా వేశారట..

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (15:48 IST)
ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేస్తే.. భారీగా జరిమానాలు విధించడం వినేవుంటాం. కానీ ఒక ఎడ్ల బండికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు.. ఉత్తరాఖండ్ ట్రాఫిక్ పోలీసులు. పొలం బయట ఆపిన ఎడ్లబండికి నో పార్కింగ్ జోన్‌లో పోలీసులు ఫైన్ వేసినట్లు రైతులు ఆరోపించారు. ఇలాంటి ఫైన్లు కూడా వుంటాయని రైతులు పోలీసులను ప్రశ్నించారు. 
 
వివరాల్లోకి వెళితే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో  ఆందోళన చేపట్టారు. ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండటంతో ప్రజల్లో వ్యతిరేకత అధికమవుతుంది. తాజాగా ఎడ్లబండికి ఫైన్ విధించడంతో రూర్కీ పట్టణంలో చేపట్టిన నిరసనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. 
 
ఉత్తరాఖండ్‌ పోలీసులపై నిరసన వ్యక్తం చేస్తూ... ఆగ్రహంతో డెహ్రాడూన్‌లోని చార్బా గ్రామ రైతులు రెండు మోటార్‌సైకిళ్లను తగులబెట్టారు. కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు తమపై భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు రైతులు ఆరోపించారు.
 
చార్బా గ్రామానికి చెందిన రియాజ్‌ హసన్‌ అనే ఎడ్ల బండి యజమానికి పోలీసులు రూ. వెయ్యి చలానా విధించడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పై అధికారుల వరకూ సమాచారం వెళ్లడంతో పోలీసులే పొరపాటు చేసినట్లు తెలుసుకున్నారు. ఇంకా ఛలానాను క్యాన్సిల్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అయినప్పటికీ రైతుల్లో ఆగ్రహం హద్దుమీరిందని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments