Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్డ్ ఫ్లూనా? జమ్మూకాశ్మీరులో 150 కాకులు మృతి

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (10:38 IST)
దేశంలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పక్షులు మరణించడం కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్, ఒడిశా, యూపీలో పక్షులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నాయి.
 
మధ్యప్రదేశ్​లోని నీముచ్, ఇందోర్​ మార్కెట్లలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయని రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్ వెల్లడించారు. ఇప్పటివరకు ఎనిమిది జిల్లాల్లో బర్డ్ ఫ్లూను గుర్తించామని స్పష్టం చేశారు.
 
మరోవైపు, రాజస్థాన్ జోధ్​పుర్ జిల్లా​లోని సెత్రావా, ఫలోదీ ప్రాంతాల్లో యాభై కాకులు మృత్యువాత పడ్డాయి. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో.. మరణించిన కాకుల నమూనాలను పరీక్షల కోసం పంపించారు అధికారులు. 
 
అనంతరం కాకుల మృతదేహాలను ఖననం చేసినట్లు తెలిపారు. ఫలోదీ సరస్సు వద్ద ఇదివరకే పదుల సంఖ్యలో కాకులు మరణించాయని అధికారులు వెల్లడించారు. జోధ్​పుర్ నుంచి పంపిన నమూనాల్లో బర్డ్ ఫ్లూ లేదని స్పష్టం చేశారు.
 
అలాగే జమ్మూకాశ్మీరులో 150 కాకులు మృతిచెందడంతో ప్రజల్లో బర్డ్ ఫ్లూ భయం ఏర్పడింది. జమ్మూకాశ్మీరులోని ఉధంపూర్, కథువా, రాజౌరి జిల్లాల్లో 150 కి పైగా కాకులు మరణించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments