Webdunia - Bharat's app for daily news and videos

Install App

హథ్రాస్‌లో మరో దారుణం.. అత్యాచార నిందితుడు అంత పనిచేశాడా?

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (16:46 IST)
హథ్రాస్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక అత్యాచార నిందితుడు రెచ్చిపోయాడు. లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లొచ్చిన నిందితుడు…బాధితురాలి తండ్రిని కాల్చి చంపాడు. బాధితురాలి తండ్రి పొలం దగ్గర కాల్పులు జరిపాడు. దీంతో బాలిక తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ కేసులో  ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు…పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన మీద సీరియస్ అయిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విచారణకు ఆదేశించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 
కాగా.. 2018లో ఒక యువతిని వేధించాడు దీంతో బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో అతన్నిఅరెస్ట్ చేశారు. రెండేళ్లు జైలుశిక్ష అనుభవించిన అతడు.. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. సోమవారం నిందితుడి భార్య, అత్త ఇద్దరు ఓ ఆలయానికి వెళ్లారు. 
 
అక్కడ మృతుడి ఇద్దరు కూతుళ్లు కూడా ఉండటంతో…ఇరువర్గాల మధ్య వాదన చెలరేగింది. దీంతో రెచ్చిపోయిన హంతకుడు… కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నిందితుడు అత్యాచార బాధితురాలి తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం